గేదెను ఢీకొట్టి పట్టాలు తప్పిన మచిలీపట్నం ప్యాసింజర్ రైలు

  • వడ్లమానాడు వద్ద పట్టాలు తప్పిన నాలుగు బోగీలు
  • వేగం తక్కువగా ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
  • బోగీలను పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారుల యత్నం
మచిలీపట్నం ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేటి సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరిన మచిలీపట్నం ప్యాసింజర్ రైలు గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్దకు చేరుకోగానే నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ గేదె అడ్డుగా రావడంతో రైలు దానిని ఢీకొట్టింది. దీంతో రైలు చివర ఉన్న నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.

ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చి లైన్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Go Back to Shorts
Machilipatnam
Passenger Train
Vijayawada
Buffalo
Passengers

More Telugu News